Site icon HashtagU Telugu

Samsung Galaxy M54 5G: శాంసంగ్ గెలాక్సి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే?

Samsung Galaxy M54 5g

Samsung Galaxy M54 5g

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించుకునేందుకు అద్భుతమైన ఫీచర్లతో, అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది ఇలా ఉంటే శాంసంగ్‌ సంస్థ భరత మార్కెట్లోకి మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం 54 5జీ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది. అయితే ఈ ఫోన్ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారత్ లో లాంచ్ చేయనుంది అని సమాచారం.

ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించనుందని సమాచారం. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ AMOLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13,1080 x 2412  రిజల్యూషన్‌, అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌ హోల్ పంచ్ డిస్‌ప్లేతో లభించనుంది. అలాగే 64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

ఇకపోతే ఇది వరకే మార్కెట్ లోకి విడుదల చేసిన శాంసంగ్‌ గెలాక్సీ ఎం 53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర రూ.24,999 , 6 జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర రూ.21,999 కాగా త్వరలో విడుదల కానున్న ఎం54 5జీ ధర రూ.30 వేలుఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ధర ఫీచర్ల గురించి అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ గతంలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర ని బట్టి ఈ ఫోన్ ఫీచర్ లను అంచనా వేస్తున్నారు.

Exit mobile version