Samsung Galaxy M33 5G : ఇంకో వారంలో రానున్న శాంసంగ్ కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్…ధర ఎంతంటే..!!

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సైట్ లో పేర్కొంది.

  • Written By:
  • Publish Date - March 28, 2022 / 04:52 PM IST

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సైట్ లో పేర్కొంది. అమెజాన్ లోకి దీనికి సంబంధించి మైక్రోసైట్ కూడా చూడవచ్చు. ఇందులో 5ఎన్ఎం ఆక్లాకోర్ ప్రాసెసర్ ను అందించనుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు. 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా ఇది సపోర్టు చేస్తుంది. ఇందులో 6.6అంగుళాల డిస్ ప్లే ఉండనుందని తెలుస్తోంది. 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉండనుంది. ఫోన్ బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు ఉండనున్నాయని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర గురించి తెలియాల్సి ఉంది.

స్పెసిఫికేషన్స్..
ఈ స్మార్ట్ ఫోన్ లో 5ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్ తోపాటుగా రెండు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం 33 5జీ స్మార్ట్ ఫోన్ లో రెండు ర్యామ్ స్టోరేజీ వేరియంట్లు ఉండనున్నాయి. 6జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000ఎంఏహెచ్ గా ఉంటుంది. 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్టు చేయనుంది. అయితే ఇప్పటికే పలు స్పేసిఫికేషన్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ 13 శాంసంగ్ గెలాక్సీ ఏ23 శాంసంగ్ గెలాక్సీ ఎం 23 5జీలతోపాటుగా ఈ ఫోన్ గతంలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ లీక్స్ ను బట్టి చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ ప్లే రానుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంటుంది.

కెమెరాల గురించి చూసినట్లయితే….ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా కెపాసిటి 50మెగాపిక్సెల్. దీంతోపాటుగా 5 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్నార్ కూడా ఉండనున్నాయి. ఇక సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఫ్రంట్ 8మెగాపిక్సెల్స్ కెమెరాను పొందుపరిచారు. ఫోన్ పక్కభాగంలోఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.