Site icon HashtagU Telugu

Samsung Galaxy M05: తక్కువ ధరకే ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోన్ కొనాల్సిందే!

Samsung Galaxy M05

Samsung Galaxy M05

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అలాగే ఇప్పటికీ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ లను కూడా ప్రకటిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం బడ్జెట్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అందులో భాగంగానే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ల శ్రేణిని విస్తరిస్తూ శాంసంగ్ గెలాక్సీ ఎం05ను తాజాగా భారత్ లో ప్రవేశపెట్టింది.

ఈ కొత్త పరికరం శాంసంగ్ గెలాక్సీ ఎం04 కి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం05లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఉన్నాయి. మరి తాజాగా భారత మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ ఫోన్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సీ ఎం05లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 1000 మెగాహెర్ట్జ్ సామర్థ్యం కలిగిన ఏఆర్ఎం మాలి జీ52 2ఈఎంసీ2 జీపీయూ ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్యూఐ కోర్ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. అలాగే కనెక్టివిటీ కోసం శాంసంగ్ గెలాక్సీ ఎం05 లో డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై ఫై 802.11 ఏసీ, 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్లు, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎఫ్ /1.8 ఎపర్చర్ కారణంగా తక్కువ కాంతి వాతావరణంలో కూడా వివరణాత్మక చిత్రాలను ఈ ఫోన్ తో తీయవచ్చు.
కాగా శాంసంగ్ గెలాక్సీ ఎం05 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999 గా ఉంది.

కాగా వినియోగదారులు ఈ ఫోన్ ని అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్సైట్, ఇతర రిటైల్ భాగస్వాముల ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ను డిమాండ్ చేసే యువ వినియోగదారుల కోసం ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించారు. ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో దీర్ఘకాలిక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అద్భుతమైన 6.7 అంగుళాల హెచ్డి + డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్టాండ్ అవుట్ ఫీచర్లతో గెలాక్సీ ఎం05 ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పడం ఖాయమని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ డైరెక్టర్ రాహుల్ పహ్వా తెలిపారు.