Site icon HashtagU Telugu

Samsung galaxy F15 5G: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల కాబోతున్న శాంసంగ్ కొత్త ఫోన్.. పూర్తి వివరాలివే?

Mixcollage 22 Feb 2024 07 05 Pm 8575

Mixcollage 22 Feb 2024 07 05 Pm 8575

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇకపోతే త్వరలోనే శాంసంగ్ సంస్థ త్వరలోనే మార్కెట్లోకి అతి తక్కువ తర కలిగిన కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ శామ్సంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. అతి త్వరలోనే ఇది లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ పేరు శామ్సంగ్ గెలక్సీ ఎఫ్15  5జీ. సామాన్యుడికి అందుబాటు ధరలో, మెరుగైన ఫీచర్లు కలిగిన ఫ్రెండ్లీ బడ్జెట్‌ ఫోన్ ను శాంసంగ్ త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. గెలాక్సీ ఎఫ్15 5జీ పేరుతో ఈ ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీఛర్లు ఉన్నాయని, ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లలో పోల్చితే గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లో మరిన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్లోని ప్రత్యేకతలు, డిజైన్, ధర తదితర వివరాలన్నీ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.. కాగా ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ధర కూడా సామాన్యులకు అందుబాటులో రూ. 15,000 కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ఎన్నో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. నాలుగేళ్ల అప్‌డేట్స్‌ గ్యారంటీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఓఎస్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను దాదాపు ఐదేళ్ల వరకూ వస్తాయి. ఆండ్రాయిడ్‌ 18కు ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో 6.6 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ, మీడియా టెక్‌ డైమన్‌సిటీ 6100+ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.