Samsung Galaxy Book4: గెలాక్సీ బుక్4 సిరీస్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ ఎప్పుడో తెలుసా?

శాంసంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ ల్యాప్‌టాప్‌లపై సంస్థ కీలక ప్రకటన చేసింది. శాంసంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ నోట్‌బుక్‌లను ఈ నెలలో భారతదేశంలో విడుదల చేయనుంది . ఫిబ్రవరి మధ్యలో శామ్‌సంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ ప్రీ-బుకింగ్‌లను ప్రకటించే అవకాశం

 

Samsung Galaxy Book4: శాంసంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ ల్యాప్‌టాప్‌లపై సంస్థ కీలక ప్రకటన చేసింది. శాంసంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ నోట్‌బుక్‌లను ఈ నెలలో భారతదేశంలో విడుదల చేయనుంది . ఫిబ్రవరి మధ్యలో శామ్‌సంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ ప్రీ-బుకింగ్‌లను ప్రకటించే అవకాశం ఉందని, ఈ నెల చివరి వారంలో కొత్త నోట్‌బుక్‌లు అమ్మకానికి రానున్నాయని సంస్థ పేర్కొంది.

అయితే శాంసంగ్ గెలాక్సీ బుక్4 అల్ట్రా దేశంలో లాంచ్ కావడానికి తమయం పట్టవచ్చని తెలుస్తుంది. కానీ శాంసంగ్ గెలాక్సీ బుక్4 ప్రో, శాంసంగ్ గెలాక్సీ బుక్4 ప్రో 360 విక్రయాలు ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ బుక్4 సిరీస్ కొత్త ఇంటెలిజెంట్ ప్రాసెసర్, మరింత స్పష్టమైన మరియు ఇంటరాక్టివ్ డిస్‌ప్లే మరియు బలమైన సెక్యూరిటీ సిస్టమ్‌తో వస్తుంది. కంపెనీ గత సంవత్సరం డిసెంబర్‌లో సిరీస్‌ను పరిచయం చేసింది. జనవరి 2024 నుండి కొరియాలో అందుబాటులోకి తెచ్చింది.

ఈ సిరీస్‌లో వేగవంతమైన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU), అధిక-పనితీరు గల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) మరియు కొత్తగా జోడించిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిపి ఒకే ప్యాకేజీగా ఉండే కొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లు విండో 11 హోమ్‌ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్‌లు వైఫై 6E, బ్లూటూత్‌ 5.3, 2 థండర్‌బోల్ట్‌ 4 ( 2 ), USB-A, HDMA 2.1 పోర్టు, మైక్రో SD, మరియు హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లు 2MP FHD ( పుల్‌ HD ) కెమెరా మరియు AI ( ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ) డ్యూయల్‌ మైక్‌ను కలిగి ఉంటుంది.

Also Read: EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. వ‌డ్డీ రేటు పెంపు..!