Samsung Galaxy A34: బంపర్ ఆఫర్ ప్రకటించిన శాంసంగ్.. ఆ ఫోన్ పై రూ.4 వేలు తగ్గింపు?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 08:33 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీ బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శాంసంగ్ ఫోన్ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే.. కాగా ఇటీవల విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ34 మోడల్ పై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.

శాంసంగ్ ఇండియా అధికారిక ఆన్ లైన్ స్టోర్ లో ఈ మిడ్ రేంజ్ ఫోన్ పై రూ. 4000 వరకూ తగ్గింపును అందిస్తోంది. అయితే కేవలం తాత్కాలికంగా మాత్రమే ఈ ఆఫర్ ను అందిస్తోందని చెబుతున్నారు. ఈ కొత్త శాంసంగ్ ఫోన్ లో అమోల్డ్ డిస్ ప్లే , ఐపీ రేటింగ్, స్టీరియో స్పీకర్స్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్ 6జీబీ ర్యామ్, 28జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ పై రూ. 26,999గా ఉంది. వాస్తవానికి ఈ 5జీ ఫోన్ కొంత కాలం క్రితం రూ. 30,999 ప్రారంభ ధరతో దీనిని మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిపై శామ్సంగ్ రూ. 4,000 ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. వాస్తవానికి శామ్సంగ్ చాలా అరుదుగా ఇలాంటి ఆఫర్లు ఇస్తుంది.

ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో 6.6 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఇది వస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెకండరీ సెన్సార్, 5ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. ఐపీ67 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఫోన్లో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. నాలుగేళ్ల వరకూ ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్టు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్ ఫోన్ లో శక్తివంతమైన డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, మంచి పనితీరును అందించగల 5జీ ఫోన్ ఇది. అయితే ఈ ఫోన్ ను కొనుగోలు చేసేవారికి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ ఫోన్ ప్యాక్ లో చార్జర్ ఉండదు.