Samsung Phones : ‘శాంసంగ్‌’ మూడు కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవిగో

ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని శాంసంగ్(Samsung Phones)  కంపెనీ ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Samsung Galaxy A Series Phones Galaxy A26 Galaxy A36 Galaxy A56

Samsung Phones : శాంసంగ్‌ నుంచి మరో మూడు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. వాటి పేర్లు.. గెలాక్సీ ఏ56 , గెలాక్సీ ఏ36 , గెలాక్సీ ఏ26.  ఈ ఫోన్ల ధరలు మిడ్ రేంజులోనే ఉంటాయి. ఏఐ ఫీచర్లు ఉండటం వీటి ప్రత్యేకత. ఈ ఫోన్లకు IP67 రేటింగ్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌యు7 తో పనిచేస్తాయి. ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని శాంసంగ్(Samsung Phones)  కంపెనీ ప్రకటించింది.

Also Read :Meenakshi Natarajan: వివాదాలకు చెక్.. యాక్షన్ స్టార్ట్.. మీనాక్షి గ్రౌండ్ ‌వర్క్

శాంసంగ్‌ A26 ఫీచర్లు

  • బ్యాటరీ :  5,000mAh
  • బ్యాటరీ సామర్థ్యం : 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • ప్రాసెసర్ : Exynos 1300
  • ప్రొటెక్షన్ : కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌
  • ర్యామ్ :  6జీబీ, 8జీబీ ర్యామ్‌ వేరియంట్లు
  • స్టోరేజీ : 128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్లు
  • కెమెరాలు : ప్రధాన కెమెరా 50ఎంపీ, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్‌, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • డిస్‌ప్లే :  6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌
  • రీఫ్రెష్ రేట్ : 120Hz
  • సెన్సర్ : సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌
  • ప్రారంభ ధర : రూ.26,200
  • రంగులు : పింక్‌, ఆలివ్‌, గ్రాఫైట్‌, లైట్‌గ్రే

Also Read :English Language: అమెరికాలో అధికారిక భాషగా ఇంగ్లిష్.. ఆంగ్లంపై ఆసక్తికర విశేషాలివీ

శాంసంగ్‌ ఏ36 ఫీచర్లు 

  • డిస్‌ప్లే : 6.7 అంగుళాల అమోలెడ్‌
  • ప్రొటెక్షన్ : కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7+ లేయర్‌
  • ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌3
  • బ్యాటరీ : 5,000mAh
  • బ్యాటరీ సామర్థ్యం : 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • స్టోరేజీ : 6జీబీ, 8జీబీ వేరియంట్లలో లభ్యం
  • ఇంటర్నల్ స్టోరేజీ : 256జీబీ వరకు ఆప్షన్
  • కెమెరాలు : 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైల్డ్‌ కెమెరా, 5 ఎంపీ మ్యాక్రో లెన్స్‌, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • రంగులు :  లావెండర్‌, బ్లాక్‌, వైట్‌, లైమ్‌
  • ప్రారంభ ధర : రూ.35,000

శాంసంగ్ ఏ56 ఫీచర్లు 

  • డిస్‌ప్లే : 6.7 అంగుళాల అమోలెడ్‌
  • ప్రొటెక్షన్ : కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7+
  • ప్రాసెసర్ : Exynos 1580
  • బ్యాటరీ : 5,000mAh
  • బ్యాటరీ సామర్థ్యం : 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • స్టోరేజీ : 8జీబీ, 12జీబీ వేరియంట్లు
  •  ఇంటర్నల్ స్టోరేజీ :  256 జీబీ ఆప్షన్‌
  • ప్రారంభ ధర : రూ.44 వేలు
  • కెమెరాలు : 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా
  Last Updated: 02 Mar 2025, 03:16 PM IST