Samsung Galaxy A14 5G: శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం

  • Written By:
  • Publish Date - March 7, 2023 / 07:30 AM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లోనే మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోని తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని కూడా విడుదల చేసింది శాంసంగ్ సంస్థ. శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999 గా ఉంది.

కాగా 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ మనకు డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ వంటి 3 కలర్స్‌లో లభిస్తోంది. ఈ నెల 20 నుంచి https://www.samsung.com/ , శాంసంగ్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ స్టోర్స్ తో పాటు వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లల్లో అందుబాటులో ఉండనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందంతో పాటు 202 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్‌పై పని చేస్తుంది.

ఇందులో 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ హెచ్‌ డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఇందులో ఎక్సినోస్ 1330 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో కూడిన 16జీబీ ర్యామ్ ఉండటం విశేషం. ర్యామ్ ప్లస్ ఫీచర్ కారణంగా.. అదనంగా వర్చువల్ ర్యామ్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ లో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్‌కు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఓఎస్ అప్గ్రేడ్స్ రానున్నాయని సామ్సంగ్ తెలియజేయడం విశేషం. ఇక కెమెరా విషయానికి వస్తే.. 50 ఎంపీ ట్రిపుల్ లెన్స్ రేర్ కెమెరా ఉంటుంది. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ను కలిగిఉండనుంది.