Site icon HashtagU Telugu

Samsung Galaxy A14 4G: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Samsung Galaxy A14 4g

Samsung Galaxy A14 4g

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా శాంసంగ్ ఫోన్స్ కి భారత మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో శాంసంగ్ సంస్థ తన మార్కెట్ ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నేను కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేయడంతో పాటు, ఆల్రెడీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ఆఫర్ లను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ14 4జీ త్వరలో బారత మార్కెట్ లోకి విడుదల చేయనుంది.

కాగా ఫోన్ యొక్క ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ A14 4G కంపెనీ నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్‌గా వచ్చే వారం భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రావచ్చు. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. శాంసంగ్ ఫోన్ బేస్ మోడల్ ధర విషయానికి వస్తే.. రూ. 13,999 కాగా, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కు అందుబాటులోకి రానుంది.

అయితే శాంసంగ్ గెలాక్సీ ఎ14 4జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ లపై ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. ఈ ఫోన్ ఇప్పటికే మలేషియాలో లాంచ్ అయింది. శాంసంగ్ ఎ14 ఫోన్ స్పెసిఫికేషన్‌లు అదే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. మలేషియాలోని శాంసంగ్ గెలాక్సీ A14 4G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
హ్యాండ్‌సెట్ 6జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో MediaTek Helio G80 SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారిత One UI 5.0 సపోర్టుతో అవుట్ ఆఫ్ ది-బాక్స్‌తో రన్ వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎ 14 4జీ మోడల్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. అలాగే ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో, డిస్ప్లే, టాప్ సెంటర్ పొజిషన్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో 13 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్‌లోని బ్యాటరీ సామర్థ్యం 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.

Exit mobile version