Site icon HashtagU Telugu

Samsung Galaxy A05: మార్కెట్లోకి మరో కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 01 Dec 2023 07 11 Pm 4820

Mixcollage 01 Dec 2023 07 11 Pm 4820

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా శాంసంగ్ సంస్థ భారత మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది. గెలాక్సీ ఏ05 పేరుతో ఈ మొబైల్‌ ని విడుదల చేసింది. ఈ మొబైల్‌ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో రానుంది.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఏ05 ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.12,499గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, సిల్వర్‌ లాంటి కలర్స్ లో లభించునుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత వన్‌ యూఐ స్కిన్‌ తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ అమర్చారు. అదనంగా 6జీబీ మెమోరీని జోడించే సుదపాయాన్ని కూడా కల్పించారు.

ఫోన్‌ వెనక 50ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లతో పాటూ అన్ని రిటైల్‌ దుకాణాల్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,000 క్యాష్‌ బ్యాక్‌ని కూడా అందించనుంది. శాంసంగ్‌ ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం పొందొచ్చని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై నెలకు రూ.875 నుంచి ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.