Mars In 30 Days: మన భూమి నుంచి అంగారక (మార్స్) గ్రహానికి 13.5 కోట్ల కి.మీ దూరం ఉంటుంది. ఇంత దూరాన్ని కేవలం 30 నుంచి 60 రోజుల్లో చేరుకోవచ్చు. ఇంతకీ ఎలా అనుకుంటున్నారా ? మరేం లేదు.. ఇందుకోసం శక్తివంతమైన, వేగవంతమైన రాకెట్‌ను రష్యా రెడీ చేసింది. ఇది ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్. గంటకు 3.13 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కెపాసిటీ దీని సొంతం. రష్యా ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ కార్పొరేషన్ రోసాటామ్ దీన్ని తయారు చేసింది. కాంతి వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోవడం ఈ రాకెట్ ప్రత్యేకత. అందుకే నెల నుంచి రెండు నెలల్లోగా భూమి నుంచి అంగారకుడిని చేరుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాకెట్లు అంగారకుడిని చేరుకోవడానికి సగటున ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి. దీన్నిబట్టి రష్యా తయారు చేసిన ప్లాస్మా రాకెట్(Mars In 30 Days) ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read :Invalid Votes: అవగాహనా రాహిత్యం.. ఎమ్మెల్సీ పోల్స్‌లో భారీగా చెల్లని ఓట్లు
ఇంధనంలో తేడా ఇదీ..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాకెట్లు తమ ట్యాంకులో ఉన్న ఇంధనాన్ని మండించి శక్తిని పొందుతాయి. ఆ శక్తితో ముందుకు దూసుకుపోతాయి. ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ అందుకు పూర్తి భిన్నమైంది. ఎందుకంటే ఇది విద్యుత్ క్షేత్రాన్ని ఉపయోగించి అయాన్లను వేగవంతం చేస్తుంది. తద్వారా ఇంజిన్‌కు శక్తి లభిస్తుంది. ఫలితంగా రాకెట్ ముందుకు దూసుకుపోతుంది. ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్‌లో హైడ్రోజన్‌ను వినియోగిస్తారు. 2030 నాటికి ఈ రాకెట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రష్యాకు చెందిన రోసాటామ్ ప్రకటించింది. ఈ రాకెట్‌లోని ఇంజిన్‌కు ఇంధనాన్ని అందించేందుకు న్యూక్లియర్ రియాక్టర్లు కావాల్సి ఉంటుందని అంటున్నారు.
Also Read :Driverless Vehicles: తెలంగాణ రోడ్లపై డ్రైవర్ రహిత వాహనాలు
ఎక్కువ ప్రయోజనం వారికే
ఈ తరహా ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్లు అందుబాటులోకి వస్తే ఎక్కువగా ప్రయోజనం దక్కేది వ్యోమగాములకే. వ్యోమగాములు అంతరిక్ష వాతావరణంలో అతి తక్కువ కాలం పాటు ఉండేందుకు ఈ రాకెట్లతో వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఈ రాకెట్ల వల్ల ప్రయాణ సమయం భారీగా ఆదా అవుతుంది. వ్యోమగాములపై కాస్మిక్ రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. వారికి ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది.