Site icon HashtagU Telugu

New Gen- Royal Enfield Bullet 350: సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 విడుదల.. ఫిచర్స్ అదిరిపోయాయిగా?

Royal Enfield

Royal Enfield

ప్రస్తుత జనరేషన్ లో యువత ఎక్కువగా ఇష్టపడే బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే రాయల్ ఎన్‌ఫీల్డ్ నూతన తరం బుల్లెట్ మోటార్ బైక్ ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 350 సీసీ ఫోర్ట్ పోలియోను రిఫ్రెష్ చేసే లక్ష్యంతో తీసుకుపోతోంది. కాగా ఇప్పటికే కొత్త ప్లాట్ఫారం పై జె సిరీస్ ఇంజిన్ తో మెటోర్ 350, జెన్ క్లాసిక్ 350, హంటర్ 350 లాంటి బైక్స్ ని లంచ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 లో కొత్త తరం ను తీసుకురాబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్ లోకి సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్ మాధురి కాకుండా కొత్త బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్ని అదనపు జాగ్రత్తలను తీసుకుంటోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎన్ని మోడళ్లు వచ్చినా, బుల్లెట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. మోటార్‌ సైకిల్ రెట్రో డిజైన్ సజీవంగా ఉంచుతూ, దాని ఆత్మకు అంతరాయం కలిగించని విధంగా మార్పులు, చేర్పులు చేయనున్నట్లు సమాచారం.

రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్‌లో చాలా సూక్ష్మమైన రీతిలో అప్‌గ్రేడ్‌లను పొందుపరచనున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌ సైకిల్ అసలైన డిజైన్ కూడా అలాగే ఉంటుంది. అదే సింగిల్,పీస్ సీట్, రెట్రో,స్టైల్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు ఉంటాయి. రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ సీటింగ్ పొజిషన్ చాలా కమాండింగ్ గా, నిటారుగా కూర్చునే విధంగా ఉంటుంది. అలాగే ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 తరహా స్విచ్ గేర్‌లు, క్లాసిక్ 350 తరహా మెరుగైన సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ హార్డ్‌వేర్ అందించనున్నారు. ఇకపై బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ఎలక్ట్రిక్ స్టార్టర్‌ను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా కలిగి ఉండనుంది. అలాగే
ఇప్పుడు ఉన్న కలర్ స్కీములతో పాటు కొన్ని కొత్తవి కలిపి మొత్తంగా 8 కలర్ ఆప్షన్లలో ఈ బైక్ రాబోతుంది. మరికొద్ది కాలంలోనే ఇది మార్కెట్లోకి లాంచ్ కానున్నట్లు సమాచారం.