Site icon HashtagU Telugu

Electric Bike : ఈ బుల్లెట్టు బండికి ఒక్క చుక్క పెట్రోల్ కూడా అవసరం లేదు..ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!!

Electric Bike

Electric Bike

భారత్ ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ వాహనతయారీ సంస్థలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల బాట పడుతున్నాయి. పర్యావరణ రహిత వెహికల్స్ తయారీని అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్య నివారణకు విద్యుత్ ఆధారిత వెహికల్సే మేలని నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ఎన్ ఫీల్డ్ కూడా రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది.

దీనిపై రాయల్ఎన్ ఫీల్డ్ సంస్ధ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ స్పందించారు. 2025-26 నాటికి తమ కంపెనీ నుంచి తొలిసారిగా ఈ బైక్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా గడువు అంటూ ఏం ఉండదని…అయితే కచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఈ బైక్ కాన్సెప్టు బైక్ పై ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో పరిశోధన జరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ ఫాంలపై విద్యుత్ ఆధారిత బైక్ ను నిర్మించడమా లేదా కొత్త ఫ్లాట్ ఫాం రూపొందించడమా అనేది డిసైడ్ అవుతామని వెల్లడించారు.