ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్ లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కీ భారీగా క్రేజ్ ఉంది. ఇలా ఉంటే తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ త్రీ బాడీ పెయింట్ ఆప్షన్స్ తో హిమాలయన్ బైక్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం ఉన్న గ్రావెల్ గ్రే, పైన్ గ్రీన్, గ్రానైట్ బ్లాక్ కలర్స్ కి అదనంగా మరొక త్రీ కలర్స్ తో బైక్ ని లాంచ్ చేసింది. అవి గ్లేసియర్ బ్లూ, స్లీట్ బ్లాక్, డ్యూన్ బ్రౌన్ కలర్.
తాజాగా లంచ్ చేస్తున్న ఈ కొత్త హిమాలయన్ బైక్ కోసం ఇండియాలోని అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టోర్‌లలో అప్పుడే బుకింగ్‌లు అండ్ టెస్ట్ రైడ్‌లు ప్రారంభమయ్యాయి. కాగా తాజాగా విడుదల చేసిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర చెన్నైలో రూ.2,15,900 ఎక్స్ షోరూమ్ గా నిర్ణయించింది. అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డూన్ బ్రౌన్ కలర్ ఆప్షన్ ధర ఢిల్లీలో రూ. 2,22,400 గా ఉంది. స్లీట్ బ్లాక్ అండ్ గ్లేసియర్ బ్లూ ధర రూ.2,23,900 గా నిర్ణయించింది. కేవలం చెన్నైలో మాత్రమే కాకుండా ఢిల్లీగా ఎక్స్ షోరూమ్ లో కూడా ధరలు ఇదేవిధంగా ఉన్నాయి.
అయితే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మొదటిసారిగా 2016లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అడ్వెంచర్ బైక్ కోసం వెతుకుతున్న బైకర్లు అండ్ రైడర్‌లకు హిమాలయన్ బైక్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ బైక్ యొక్క ఇంజిన్ అండ్ పవర్ విషయానికి వస్తే.. ఈ బైక్ 411సీసీ , ఎయిర్ కూల్డ్, SOHC ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 24.3 bhp శక్తిని, 4,000-4,500 rpm వద్ద 32 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో కంస్టంట్ మెష్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. తాజాగా విడుదల చేసిన ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధర తెలిసి వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు..