New Electric Scooter: మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎలక్ట్రిక్ వాహనం వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎలక్ట్రిక్ వాహనం వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు నిత్యం కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఆల్రెడీ మార్కెట్ లోకి విడుదల చేసిన ఎలక్ట్రిక్ వాహనాలలో కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ చూడటానికి సరికొత్తగా ఉంది.

సరికొత్త లుక్ తో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డిజైన్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,24,999 గా ఉంది. ఇండి లైఫ్‌స్టైల్ యూటిటేరియన్ స్కూటర్‌గా విక్రయించే ఈ స్కూటర్‌లో ఎదురుగా రెండు భారీ ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. అలాగే ఫ్లోర్ బోర్డ్ మౌంట్‌తో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే కాంబి బ్రేక్ సిస్టమ్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో 165 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అధునాతన టెయిల్ లైట్ డిజైన్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో కచ్చితంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా ఈ స్కూటర్ మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది.

అయితే ఈ స్కూటర్ 135 కిలోల బరువను మోసేలా ఈ న్యూ స్కూటర్‌ ను కంపెనీ డిజైన్ చేసింది. అలాగే ముందు, వెనుక కూడా గాబ్రియేల్ షాక్ అబ్జార్బర్లను కంపెనీ అందిస్తుంది. ఈ స్కూటర్ 6.7 కెడబ్ల్యూ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే పీఎంఎస్ఎం మోటర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఫ్లోర్ బోర్డ్ మౌంట్ చేసిన 4 కెడబ్ల్యూ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది. అలాగే కేవలం ఐదు గంటల్లో బ్యాటరీను 0 నుంచి 80 శాతం వరకూ చార్జ్ చేయవచ్చు. ఇక నీరు, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ-67 సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 43 లీటర్ల అండర్ స్టోరేజీ స్పేస్ కెపాసిటితో వస్తుంది. 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ కూడా ఈ స్కూటర్ ప్రత్యేకం. అలాగే యూఎస్‌బీ చార్జింగ్ పోర్టులతో ఈ స్కూటర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే గంటకు 90 కిలోమీటర్ల హై స్పీడ్ ఈ స్కూటర్ దూసుకుపోతుంది.