Electric Bike: సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్.. లుక్, ఫీచర్స్ మాములుగా లేవుగా?

ప్రస్తుత రోజులో వాహన వినియోగదారులు ఎక్కువగా సింపుల్ గా వెయిట్ లెస్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లపై ఆసక్తిని చూపిస్తూ

  • Written By:
  • Publish Date - February 27, 2023 / 07:30 AM IST

ప్రస్తుత రోజులో వాహన వినియోగదారులు ఎక్కువగా సింపుల్ గా వెయిట్ లెస్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లపై ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వెయిట్ లెస్ ఉండే బైకులు ఉంటే బాగుండు తేలిగ్గా ఉండే బైకులు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వారి కోసం రైడ్1అప్ కంపెనీ సైకిల్ లాంటి బైక్ తెచ్చింది. మరి ఆ సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్, ధర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రైడ్1అప్ కంపెనీ.. రోడ్‌స్టర్ వి2 గ్రావెల్ ఎడిషన్ అనే బైక్ ని విడుదల చేసింది. అయితే అచ్చం ఇది చూడటానికి సైకిల్ లాగా ఉంటుంది కానీ సైకిల్ కాదు.

సింపుల్‌గా, ఫాస్ట్‌గా, ఫన్ ఇచ్చేలా ఎలక్ట్రిక్ బైక్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా మిగతా ఎలక్ట్రిక్ బైక్‌లతో పోలిస్తే దీని బరువు 15 కేజీలే. అయితే ఈ బైక్ ని రోడ్డుపై నడుపుతున్నప్పుడు ఇది సైకిల్ లాగా వెళ్లిపోతూ ఉంటుంది. ఇది బైక్ అని కూడా ఎవరూ అనుకోరు. పెడల్స్ తొక్కకుండానే ఇది వెళ్లిపోవడం చూసి చాలామంది చుట్టూ ఉన్న వాహనదారులు కూడా ఆశ్చర్యపోతారు. ఈ బైక్‌కి వైర్లు బయటకు ఉండవు. వైర్లను ట్యూబ్‌లలో సెట్ చేశారు. పైగా దీనికి కిక్ స్టాండ్, లైట్స్, ఫెండర్స్ వంటివి కూడా లేవు. లెఫ్ట్ బ్రేక్ లెవెర్ దగ్గర మాత్రం ఒక బెల్ ఉంది.

సిటీల్లో డ్రైవింగ్ చేసే వారికి అనుకూలంగా ఈ బైక్‌ని తయారు చేశారు. కాగా ఈ బైక్ మనకు బర్గుండీ మాట్టే, గ్రావెల్ గ్రే, బ్లాక్ మాట్టే, సిల్వర్ మాట్టే వంటి 4 కలర్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 32 కిలోమీటర్ లు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌ని పెడల్స్ తొక్కుతూ వెళ్తే 38 కిలోమీటర్ల దూరం వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాగా ఈ రోడ్‌స్టర్ వి 2 గ్రావెల్‌ ఎలక్ట్రిక్ బైక్ ధర $1,095 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.90,803 గా ఉండబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ బైక్ కావాలనుకున్న వారు Ride1Up వెబ్‌సైట్‌లో $69 అనగా రూ.5,721 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.