Site icon HashtagU Telugu

UPI Rules: 2025 కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

Upi

Upi

మరికొద్ది రోజుల్లోనే 2024 సంవత్సరం ముగియనుంది. 2025 వ సంవత్సరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్‌బీఐ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్ ఈ నియమాలను తెలుసుకోవడం చాలా అవసరం. అయితే యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలు, వాటి ద్వారా జరిగే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే యూపీఐ చెల్లింపులలో రాబోయే మార్పుల విషయానికి వస్తే..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం, మార్పును చూపుతాయట. అయితే ముందుగా యూపీఐ లావాదేవీ పరిమితులకు తీవ్రమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అంటే జనవరి 1 నుండి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీ పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం రూ.5,000 కాగా, ఇప్పుడు దానిని రూ.10,000కి పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త నిబంధనలను ప్రకటించినప్పటికీ, బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలను పాటించడానికి, వినియోగదారులకు సేవలను అందించడానికి సమయం ఇచ్చారు. ఈ వ్యవధి ఈ నెల డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది.

అలాగే జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపులు చెల్లింపు లావాదేవీల పరిమితిని అనుసరించాలని బ్యాంకులకు సూచించింది ఆర్‌బీఐ. కాగా జనవరి 1 నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు కూడా అమలులోకి వస్తాయట. UPI 123 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా ఛార్జీ విధించరు. అంతే కాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ ని కూడా అందించబోతోందట. అంటే బీచర్ ఫోన్ల ద్వారా ఐవీఆర్ నంబర్ను ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేయవచ్చు. మీరు ఇంటర్నెట్ సేవతో మొబైల్ ఫోన్‌ లను కలిగి ఉండవలసిన అవసరం లేదట.