Delete Truecaller : ట్రూకాలర్​ అకౌంట్ తీసేయడం.. ఫోన్​ నంబర్​ తొలగించడం ఇలా..

Delete Truecaller : మీకు ట్రూకాలర్ అకౌంట్ ఉందా ? దాన్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నారా?

Published By: HashtagU Telugu Desk
Delete Truecaller

Delete Truecaller

Delete Truecaller : మీకు ట్రూకాలర్ అకౌంట్ ఉందా ? దాన్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నారా? ట్రూకాలర్​ నుంచి ఫోన్ నంబర్​ను తీసేయాలని భావిస్తున్నారా ? అయితే ఇది మీ కోసమే. మనకు వచ్చే ఫోన్ కాల్స్‎లో చాలా వరకు స్పామ్ కాల్స్ ఉంటాయి. వాటిని ముందుగా గుర్తించడానికి చాలామంది ట్రూకాలర్ యాప్​ను ఉపయోగిస్తూ ఉంటారు. ట్రూకాలర్ యాప్‎ని ఫోన్‎లో ఇన్‎స్టాల్ చేసుకుంటే, మనకు ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయో సులువుగా తెలిసిపోతుంది. ఫలానా బ్యాంక్ నుంచి వస్తున్న స్పామ్ కాల్ అని, లేదంటే ఫ్రాడ్ కాల్ అని అది చూపిస్తుంది. దీని వల్ల చాలా వరకు స్పామ్ కాల్స్ బాధ నుంచి తప్పించుకోవచ్చు. ట్రూకాలర్ యాప్ వల్ల ఉపయోగం కొంత ఉన్నా.. దీని వల్ల ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే చాలా మంది ట్రూకాలర్ యాప్‎ను డిలీట్ చేసి, ట్రూకాలర్​ (Delete Truecaller) సర్వర్​ నుంచి తమ పేర్లను తీసేయాలని అనుకుంటూ ఉంటారు. ఈక్రమంలో ట్రూకాలర్ యాప్‎ని ఎలా డిలీట్ చేయాలి? మొబైల్ నంబర్​ను ఎలా తీసివేయాలో తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

డిలీట్ చేయడం ఇలా.. 

తొలుత మీ మొబైల్​లో ఉన్న ట్రూకాలర్ యాప్‎ను ఓపెన్ చేయండి. స్క్రీన్ పై భాగంలో ఉండే మూడు చుక్కలను లేదా గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత Settings మీద క్లిక్ చేసి అక్కడ Privacy Centerలోకి వెళ్లండి. అక్కడ Deactivate బటన్‎పై క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ ప్రాంప్ట్​లో YES పై నొక్కి కన్ఫార్మ్​ చేయండి. పైన చెప్పిన విధంగా చేస్తే మీ ట్రూకాలర్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది.

Also Read :Kamal Nath – BJP : కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి కమల్‌నాథ్.. ? నకుల్‌నాథ్ సిగ్నల్

ఫోన్ నంబర్​ తీసేయడం ఇలా.. 

తొలుత వెబ్​ బ్రౌజర్‎లోకి వెళ్లి  https://www.truecaller.com/unlisting లింక్​ను ఓపెన్ చేయండి. మీ ఫోన్ నంబర్‎తో పాటు మీ దేశం కోడ్​ను కూడా ఎంటర్ చేయండి. అక్కడ Un-list Phone Numberపై క్లిక్  చేయండి. ఇలా చేసి ట్రూకాలర్ నుంచి మీ నంబర్​ను​ శాశ్వతంగా తొలగించుకోవచ్చు. మీరు ట్రూకాలర్ యాప్‎ను డిలీట్ చేసినా, గతంలో మీ మొబైల్‎లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ట్రూకాలర్‎ సర్వర్లలో ఉంటుంది. వాటిని డిలీట్ చేయడం కుదరదు. కానీ మీరు కొత్తగా యాడ్ చేసుకునే నంబర్ల వివరాలు మాత్రం ట్రూకాలర్​లో నమోదు కావు. ఒకవేళ మీరు ట్రూకాలర్ యాప్‎ని డీయాక్టివేట్ చేయాలని భావిస్తే.. ట్రూకాలర్ యాప్‎ని ఓపెన్ చేసి అక్కడ పీపుల్స్ ఐకాన్​ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్‎లోకి వెళ్లి aboutపై క్లిక్ చేయండి. ‘డీయాక్టివేట్ అకౌంట్’ అనే దానిపై క్లిక్ చేస్తే, మీ ట్రూకాలర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది.

Also Read : Russia – Palestine : ‘పాలస్తీనా’ మిలిటెంట్ గ్రూపులకు పుతిన్ పిలుపు.. ఎందుకు ?

  Last Updated: 17 Feb 2024, 03:33 PM IST