ప్రముఖ టెలికాం దిగ్గజం జియో ఇటీవల కాలంలో రీఛార్జ్ ధరలను పెంచుకుంటూ పోతోంది. దీంతో ఇప్పటికే చాలామంది జియో యూజర్లు బిఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలకు చేంజ్ అయిన విషయం తెలిసిందే. రీఛార్జ్ ధరలను అంతకంతకు పెంచుకుంటూ పోతోంది. అయితే వినియోగదారులు ఇతర టెలికాం కంపెనీలకు షిఫ్ట్ అవడంతో కాస్త తగిన జియో తక్కువ ధరకే మంచి మంచి ప్లాన్లను తీసుకువస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది జియో సంస్థ.
మరి ఆ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. కాగా రిలయన్స్ జియో రూ. 198 రీఛార్జ్ పై రోజుకు 2జీబీ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. దీనితో పాటు వినియోగదారులు అన్ని నెట్‌వర్క్ లలో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMS పంపే సౌకర్యాన్ని పొందుతారు. ఇది కాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో 14 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కి కూడా యాక్సెస్ అందుకుంటారు.
అయితే, అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని పొందడానికి, మీ ప్రాంతంలో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని, మీకు 5జీ స్మార్ట్‌ఫోన్ ఉందని నిర్ధారించుకోవాలి. మరో ప్లాన్ విషయానికొస్తే..జియో రూ.199 ప్లాన్ కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. ఇది కాకుండా అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, జియో యాప్ లకు యాక్సెస్ కూడా ఉన్నాయి. జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్ లు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే దీని కోసం మీ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ ఉండటం, మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ ఉండాలి. రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉన్న టెలికాం కంపెనీ. సరసమైన ప్లాన్‌లు, అద్భుతమైన నెట్‌వర్క్ సేవలతో కంపెనీ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. జియో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.200 లోపు ప్లాన్‌లను అందిస్తోంది.