Site icon HashtagU Telugu

5G Service: జియో యూజర్లకు గుడ్ న్యూస్..5జీ సేవలు అప్పుడే మొదలు?

Jio Down

Jio 5g

దేశవ్యాప్తంగా ప్రజలు జియో 5జి సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వేగంగా ఇంటర్నెట్ సేవలను పొందడానికి జియో యూజర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జియో కొత్త బాస్ అయినా ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 5జీ రోల్ అవుట్ అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుక జరుపుకుందాం అని తెలిపారు. దీంతో జియో 5జి సేవలను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానుందీ అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే 5జీ నెట్వర్క్ కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని జియో కీ సిద్ధంగా ఉండడంతో దేశంలో మొదట 5జీ సేవలను జియో ని అందుబాటులోకి తీసుకువస్తుంది అని అందరూ భావించారు. కాగా సోషల్ మీడియాలో జియో 5జీ సేవలు 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆగస్టు 15 కి కేవలం మరికొద్ది రోజులు సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటివరకు జియో నుంచి ఎటువంటి అధికారికంగా ప్రకటన రాలేదు. దీంతో స్వాతంత్ర దినోత్సవానికి 5జి సేవలను అందుబాటులోకి తీసుకురావాలి అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాదేమో అన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

మరి ఈ విషయంపై క్లారిటీగా కావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి. ఇకపోతే ఇప్పటికే జియో అతిపెద్ద 4జీ నెట్వర్క్ ను విడుదల చేసి అనేక ప్రపంచ అధికారులను సృష్టించిన విషయం తెలిసిందే. జియో 4జీ నెట్వర్క్ నమ్మకమైన సంతోషదాయకమైన వినియోగదారులకు అధిక నాణ్యత,అత్యంత సరసమైన డిజిటల్ సేవలను అందిస్తోంది. ఇప్పుడు జియో 5జీ సేవలను కూడా అందించడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version