Site icon HashtagU Telugu

Jio New Recharge Plans: ఎట్టకేలకు దిగివచ్చిన జియో.. ఎయిర్టెల్ పోటీగా నిలుస్తూ సరికొత్త ప్లాన్స్!

Jio New Recharge Plans

ప్రముఖ టెలికాం కంపెనీ అయిన జియో ఇటీవలె తన రీఛార్జ్ ప్లాన్లను మరింత పెంచిన విషయం తెలిసిందే. దీంతో రీఛార్జ్ ల విషయంలో విసిగెత్తిపోయిన వినియోగదారులు జియో నుంచి ఇతర టెలికాం కంపెనీలకు పోర్ట్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది జియో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలకు పోర్ట్ అవ్వడంతో పాటు మరికొందరు పోర్ట్ అవడానికి సిద్ధమవుతుండగా ఇలాంటి నేపథ్యంలో కస్టమర్లను నిలబెట్టుకోవడం కోసం అలాగే కొత్త కస్టమర్లను ఆగట్టుకోవడం కోసం రిలయన్స్ జియో సంస్థ కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది.

ఒకవైపు కస్టమర్లను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే మరొకవైపు టెలికాం కంపెనీ అయిన ఎయిర్టెల్ కు పోటీగా నిలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే 200 రూపాయల్లోపు రెండు రీఛార్డ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ సామాన్యులకు కూడా అనుకూలంగా ఉండనున్నాయి. కాగా జియో కొత్తగా రెండు రీఛార్డ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఇవి 200 రూపాయల్లోపే ఉండటం విశేషం. ఇందులో ఒకటి జియో 198 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ ల సౌకర్యం ఉంటుంది. అన్‌లిమిటెడ్ 5జి డేటా లభిస్తుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు కూడా అందుతాయి.

మరో ప్లాన్ జియో 189 రీఛార్జ్ ప్లాన్. 199 రూపాయలకు బదులు 189 రూపాయల ప్లాన్ బెస్ట్ ఉంటుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం ట్రెండింగ్‌ లో ఉంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌ ల సౌకర్యం ఉంటుంది. అన్నింటికీ మించి ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ప్రస్తుతం జియో అందిస్తున్న వివిధ ప్లాన్స్‌లో ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. జియో 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఇది 18 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందవచ్చు. తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్స్ పొందాలంటే ఇవే బెస్ట్. వినియోగదారులు పోర్ట్ అవుతుండడంతో జియో సంస్థ దిగి వచ్చింది. వినియోగదారులను ఎప్పటిలాగే ఆకర్షించడం కోసం తక్కువ ధరలకే మంచి మంచి రీఛార్జిలను అందించడానికి సిద్ధమయ్యింది.