JioTag Air : జియో ట్యాగ్ ఎయిర్.. రిలయన్స్ జియో నుంచి వచ్చిన సరికొత్త స్మార్ట్ పరికరం ఇది. గతంలో జియో ట్యాగ్ అనే పరికరాన్ని రిలయన్స్ జియో(Reliance Jio) తీసుకొచ్చింది. దానికి అప్‌గ్రేడ్ వర్షనే జియో ట్యాగ్ ఎయిర్(JioTag Air). దీనికి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
మనలో చాలామంది టెన్షన్‌లో చాలా విషయాలు మర్చిపోతుంటారు. తాళం చెవులు, పర్సు, డబ్బులు, బంగారు ఆభరణాలు వంటివి ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టి.. వాటిని మర్చిపోతారు. ఆ తర్వాత వాటిని వెతికేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇలాంటి వారికి జియో ట్యాగ్ ఎయిర్ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే.. JioTag Airలో ఫైండ్ డివైజ్ అనే ఫీచర్ ఉంటుంది. దాని ద్వారా ఆయా వస్తువులను ఎక్కడున్నా ఈజీగా, స్పీడుగా గుర్తించే వీలు ఉంటుంది. జియో ట్యాగ్ ఎయిర్ రెండు రకాల ట్రాకింగ్ యాప్స్ సహకారంతో పనిచేస్తుంది.
Also Read :Muharram: 17న మొహర్రం.. ఈ పండుగ చరిత్ర, సందేశం ఇదీ..
ఆండ్రాయిడ్ యూజర్లు జియో థింగ్స్ యాప్‌తో కూడా దీన్ని వాడొచ్చు. యాపిల్ యూజర్లు ఫైండ్ మై నెట్‌వర్క్ యాప్ ద్వారా జియో ట్యాగ్ ఎయిర్ డివైజ్‌ను కనెక్ట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్ 14, ఆపై ఓఎస్‌తో ఫోన్లలో ఈ యాప్ ఎంచక్కా పనిచేయగలదు. జియో ట్యాగ్ ఎయిర్‌లోని ట్రాకర్ బ్లూటూత్ 5.3తో పనిచేస్తుంది. ఇందులోనే బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంటుంది. 90 నుంచి 120 డెసిబుల్స్ మేర సౌండ్ చేసే కెపాసిటీ దీని సొంతం. జియో ట్యాగ్ ఎయిర్ బరువు 10 గ్రాములే. ఇందులోని బ్యాటరీ 12 నెలలు పనిచేస్తుంది. ఇంకో బ్యాటరీని ల్యాన్‌యార్డ్ రిటైల్ బాక్సులో అదనంగా అందిస్తున్నారు. క్రెడ్, పేటీఎం, ఎంపిక చేసిన కార్డులతో జియో ట్యాగ్ ఎయిర్‌ను కొంటే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియోట్యాగ్ ఎయిర్ ధర రూ.1,499. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలోనూ కొనొచ్చు. బ్లూ, గ్రే, రెడ్ కలర్స్‌లో ఇది లభిస్తుంది.