Site icon HashtagU Telugu

Jio Plans: మతిపోగొడుతున్న జియో రీఛార్జ్ ప్లాన్స్.. తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాలిడిటీ!

Jio Recharge Plan

Jio Recharge Plan

ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇటీవల రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో కాస్త తగ్గి దిగివచ్చిన జియో సంస్థ ఇప్పుడు తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకువస్తూ వినియోగదారుల దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే మరి తక్కువ ధరకే జియో సంస్థ తీసుకువచ్చిన ఆ రీఛార్జ్ ప్లాన్లు ధరలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రూ. 75 ప్లాన్.. ఈ ప్లాన్ 23 రోజుల చెల్లు బాటుతో వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100ఎంబీ డేటాతో 200ఎంబీ అదనపు డేటా, మొత్తం 50 SMSలను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌ కు కూడా యాక్సెస్‌ ను అందిస్తుందట.

రూ. 91 ప్లాన్.. ఈ 91 రూపాయల రీఛార్జి ప్లాన్ 28 రోజుల చెల్లు బాటుతో వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100ఎంబీ డేటాతో 200ఎంబీ అదనపు డేటా, మొత్తం 50 SMS లను అందిస్తుంది. అలాగే రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌ కు కూడా యాక్సెస్‌ ను అందిస్తుందట.

రూ. 125 ప్లాన్.. ఈ ప్లాన్ 23 రోజుల చెల్లు బాటుతో వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, మొత్తం 300 SMSలు, 0.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌ కు కూడా యాక్సెస్‌ ను అందిస్తుందట.

రూ. 152 ఈ ప్లాన్ 28 రోజుల చెల్లు బాటుతో వస్తుందట. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, మొత్తం 300 SMSలు, 0.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుందట. కాగా ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌ కు కూడా యాక్సెస్‌ ను అందిస్తుందట.

రూ. 186 ప్లాన్.. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లు బాటుతో వస్తుందట. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1జీబీ డేటాను అందిస్తుందట. అలాగే రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌కు కూడా యాక్సెస్‌ ను అందిస్తుందట.

రూ. 895 ప్లాన్.. ఈ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో వస్తుందట. ఈ ప్లాన్‌ లో అపరిమిత కాలింగ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 28 రోజులకు 50 SMSలు, 28 రోజులకు 2జీబీ డేటాను అందిస్తుందట. ఈ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుందట. ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌ కు కూడా యాక్సెస్‌ ను అందిస్తుందట.