Site icon HashtagU Telugu

Reliance Data: ల్యాప్ టాప్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించిన జియో.. తెలిస్తే వావ్ అనాల్సిందే!

Reliance Jio

Reliance Jio

రిలయన్స్ జియో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్ ను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్‌లో ఈ ల్యాప్‌టాప్ కొనొచ్చు. ఇది స్మార్ట్ ఎల్‌టీఈ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ కోసం జియో సిమ్ కనెక్షన్ తీసుకోవచ్చు. అలా ల్యాప్‌టాప్ కొన్నవారికి జియో నుంచి 100జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. హెచ్‌పీ ల్యాప్‌టాప్స్ కొనే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. హెచ్ పీ స్మార్ట్ సిమ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి తాజాగా ఈ గుడ్ న్యూస్ ని తెలిపింది జియో. జియో నుంచి 100 జీబీ ఉచిత డేటా లభిస్తుంది.

అది కూడా ఏడాది కాల పరిమితితో.. ఈ డేటాతో జియో డిజిటల్ లైఫ్ ను యూజర్లు ఆనందించొచ్చని రిలయన్స్ జియో ప్రకటించింది. కాగా ఈ ఉచిత డేటా కోసం యూజర్లు తప్పకుండా జియో హెచ్ పీ స్మార్ట్ సిమ్ కలిగి ఉండాలి. హెచ్ పీ కంపెనీకి చెందిన కొన్ని ల్యాప్ టాప్ మోడళ్ల కొనుగోలుపై ఈ 100 జీబీ ఉచిత డేటా ప్యాక్ అమల్లో ఉంటుంది. ల్యాప్ టాప్ కొనుగోలు తో పాటు వచ్చే ఉచిత జియో సిమ్ ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఉచిత జియో డేటా ప్యాక్ అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి దాటిన తర్వాత డేటా వేగం 64 కేబీపీఎస్ కు తగ్గిపోతుంది.

అప్పుడు జియో ప్యాక్ ల నుంచి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిలయన్స్ డిజిటల్ స్టోర్ కు వెళ్లి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలి అనుకుంటే 100 జీబీ ఉచిత డేటా ప్యాక్ యక్టివేట్ చేయాలని అడగాలి. ఆన్ లైన్ లో అయితే రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్, హెచ్ పీ స్మార్ట్ ల్యాప్ టాప్ పోర్టళ్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

Exit mobile version