Site icon HashtagU Telugu

Redmi Note 14: భారత మార్కెట్ లోకి రెడ్ మీ నోట్ 14 సిరీస్.. విడుదల అయ్యేది అప్పుడే!

Redmi Note 14

Redmi Note 14

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రెడ్ మీ ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. రెడ్ మీ నోట్ 14 ఫోన్ ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. రెడ్ మీ నోట్ ప్రో, రెడ్ మీ నోట్ ప్రో+ బేస్ మోడల్స్. ఇంతకుముందు ఈ మోడల్‌ లను 2024 ప్రారంభంలో ప్రారంభించాలని నిర్ణయించారు.

అయితే ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వచ్చేనెల అనగా డిసెంబర్ నెలలో ఈ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారట. రెడ్ మీ 14 అప్‌డేట్ సిరీస్‌ లోని అన్ని మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ తో 6.67 అంగుళాల OLED స్క్రీన్‌ తో వస్తాయి. ఇందులో బేస్ వేరియంట్ మీడియాటేక్ డైమేన్సిటీ 7025 అల్ట్రా SoC ద్వారా అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రో, ప్రో ప్లస్ వెర్షన్‌ లు వరుసగా స్నాప్‌డ్రాగన్ 7S Gen 3, స్నాప్‌ డ్రాగన్ 7300 అల్ట్రా చిప్‌సెట్‌ లను పొందుతాయట. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. రెండు మోడళ్లలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

నోట్ ప్రో+ వెర్షన్ అదనపు 50ఎంపీ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ప్రోలో 2ఎంపీ మాక్రో కెమెరా ఉంది. అలాగే రెడ్ మీ నోట్ 14 ప్రో + 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో 6,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇంతలో నోట్ 14 ప్రో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 5,500mAh బ్యాటరీని ప్యాక్ ని అందించారు. అలాగే రెండు ఫోన్‌లు ఐపీ 66+ఐపీ 68+ఐపీ 69 వాటర్‌ ప్రూఫ్ రేటింగ్‌ ను కలిగి ఉన్నాయి. కాగా చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే సుమారు రూ.18 వేల నుంచి రూ.23 వేలు. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ.20 వేల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు.