Redmi Note 12: రెడ్ మీ స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 04:06 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫోన్ల లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రెడ్ మీ సంస్థ మరో స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపు ధరను ప్రకటించింది. రెడ్‌మీ నోట్‌12 సిరీస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. గత ఏడాది మార్చిలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ ధరను కంపెనీ ఇప్పటికే రెండు సార్లు తగ్గించింది. దీంతో ఈ ఫోన్‌ బడ్జెట్ రేంజ్‌లో లభిస్తోంది.

దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 10,499కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. లాంచింగ్ సమయంలో రెడ్​మీ నోట్ 12 4జీ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 గాను, 6 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గాను ఉండేది. అనంతరం.. జనవరిలో ఈ రెండు ఫోన్ల ధరలను రూ.2,000 తగ్గించారు. తాజాగా అందించిన డిస్కౌంట్‌తో రెడ్​మీ నోట్ 12 4జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కి తగ్గింది. ఇక 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999కి చేరింది. అయితే ఈ డిస్కౌంట్‌ ఇక్కడితే ఆగిపోలేదు ఫ్లిప్‌కార్ట్‌లో డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. గరిష్టంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ను రూ. 9,597కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఇకపోతే.. రెడ్‌మీ నోట్‌ 12 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరి విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ప్రో మోడ్, డాక్యుమెంట్ మోడ్, షార్ట్ వీడియో, పనోరమ, కస్టమ్ వాటర్మార్క్ వంటి ఎన్నో ఫీచర్లను అందింఆచరు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తున్న వేళ రెడ్‌మీ ఈ 4జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.