Redmi Note 14 Pro: మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 14 ప్రో.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పు

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 12:45 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త ఫోన్లు విడుదల అవుతాయా అని వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. కాగా రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కాగా త్వరలో రాబోయే రెడ్​మీ నోట్ 14 సిరీస్ కు సంబందించి కొన్ని లీకులు ఇప్పటికే ఇంటర్నెట్​లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే. రెడ్​మీ నోట్ 14 ప్రో స్మార్ట్​ఫోన్ మెరుగైన సెన్సార్ తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుందట. రెడ్​మీ నోట్ 13 ప్రోతో పోలిస్తే ఈ రెడ్​మీ నోట్​ 14 ప్రో స్మార్ట్​ఫోన్​ టెలిఫోటో కెమెరాతో రావచ్చు. ఇందులో ఓఐఎసతో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే రెడ్​మీ నోట్ 14 ప్రోలో 1.5 కే రిజల్యూషన్​ తో మైక్రో కర్వ్​డ్ డిస్​ప్లే, నోట్ 13 ప్రో మాదిరిగానే పంచ్ హోల్ కెమెరా కట్ అవుట్ ఉండే అవకాశం ఉంది.

గతంలో ఈ స్మార్ట్​ఫోన్ క్వాల్కమ్​ స్నాప్​ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్​వోసీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఐఎంఈఐ డేటాబేస్​లో కనిపించింది. కాగా ఈ రెడ్​మీ నోట్ 14 సిరీస్ సెప్టెంబర్​ లో లాంచ్ కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెడ్​మీ నోట్ 13 ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.67 ఇంచ్​ 1.5కే అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 67వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేసే లి-పో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.