Redmi Note 13: మార్కెట్ లోకి సరికొత్త రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పుడె

Published By: HashtagU Telugu Desk
Mixcollage 02 Jan 2024 06 09 Pm 6852

Mixcollage 02 Jan 2024 06 09 Pm 6852

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త ఫోన్లు విడుదల అవుతాయా అని వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ విడుదల అవ్వడం ఆలస్యం వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ల కోసం ఎగబడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్ మీ సంస్థ త్వరలో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. మరి ఆ సరికొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే..

రెడ్ మీ సంస్థ జనవరి 4న రెడ్‌మి నోట్ 13 లాంచ్ చేయనుంది. మరి ఈ రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. డివైజ్‌లో 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, 8జీబీ LPDDR4X ర్యామ్ మంచి పనితీరును అందిస్తాయి. 256జీబీ వరకు UFS 2.2 స్టోరేజీ దీని సొంతం. నోట్ 13 5జీ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌ దీంట్లో ఉంటాయి.

సెల్ఫీల కోసం ముందు భాగంలో 16ఎంపీ కెమెరాను అందించారు. ఈ సిరీస్‌లో మరో మోడల్ రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో బెటర్, ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 8జీబీ LPDDR5 ర్యామ్, 256జీబీ వరకు UFS 3.1 స్టోరేజ్‌తో డివైజ్ రావచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. సిరీస్‌లో హై ఎండ్ మోడల్ నోట్ 13 ప్రో ప్లస్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌తో, 12జీబీ LPDDR5 RAM, 512జీబీ వరకు UFS 3.1 స్టోరేజ్‌తో రావచ్చు. స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. రెడ్‌మీ నోట్ 13 5జీ ఫోన్ ధర రూ.20,999 నుంచి ప్రారంభమవుతుంది. స్టోరేజ్‌ను బట్టి దీని ధర రూ.24,999 వరకు ఉండవచ్చు. రెడ్‌మి నోట్ 13 ప్రో 5G ధర రూ.28,999 కాగా నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ధర రూ.28,999 నుంచి ప్రారంభమవుతుందట.

  Last Updated: 02 Jan 2024, 06:12 PM IST