Site icon HashtagU Telugu

Redmi 12 5G: మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్.. ధర వివరాలివే?

Redmi 12 5g

Redmi 12 5g

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రెడ్ మీ సంస్థ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. రెడ్‌మీ 12 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. కాగా ఈ ఫోన్ మనకు రెండు వేరియంట్ లలో లభించనుంది.

అందులో ఒకటి 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మరొకటి 8జీబీ ర్యామ్‌ 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్ తో లభించనున్నాయి. అందులో ఒక వేరియంట్ ధర రూ. 9,999 కాగా హైఎండ్‌ మోడల్‌ రూ.13,999గా ఉండనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.79 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1080 X 2400 పిక్సెల్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో జీ88 12ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. కాగా ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్ లను అందించారు.