Site icon HashtagU Telugu

Redmi Note 13 Pro+: మార్కెట్లోకి మరో రెడ్‌మీ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 19 Dec 2023 01 33 Pm 7218

Mixcollage 19 Dec 2023 01 33 Pm 7218

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను కూడా ప్రకటిస్తోంది రెడ్‌మీ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకురాబోతోంది. కాగా త్వరలో విడుదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుందట.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరుతో ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనుంది. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. మరి ఈ ఇక రెడ్‌ నోట్‌ 13 ప్రో+ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మీడియా టెక్‌ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే స్క్రీన్ విషయానికొస్తే.. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 1.5 కే రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన స్క్రీన్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను జనవరి 4వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,500గా నిర్ణయించారు.