Site icon HashtagU Telugu

Note 12 Turbo: మార్కెట్ లోకి రెడ్ మీ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Note 12 Turbo

Note 12 Turbo

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోని తాజాగా మరో సరికొత్త ఫోన్ కూడా లాంచ్ చేయనుంది. రెడ్‌మీ నోట్‌ టర్బో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. చైనాలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే భారత్‌ లోకి కూడా విడుదల కానుంది.

మొత్తం నాలుగు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే. ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz ఈ ఫోన్‌ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో రెయిర్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఫోన్ బ్యాక్ సైడ్ 64ఎంపీ 8ఎంపీ 2MPw కెమెరాలను అందించారు. ఇక సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 67W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.కాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌ 256 జీబీ మోడల్‌ ధర రూ. 23,900 కాగా 12 జీబీ ర్యామ్‌ +256 జీబీ ధర రూ. 26,300 గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్‌ 512 జీబీ ధర రూ. 28,700 కాగా 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్ ధర రూ. 33,400గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు బ్లూ, కార్బన్ బ్లాక్, ఐస్ ఫెదర్ వైట్ వంటి కలర్స్‌లో లభించనుంది.