Redmi 13c: రూ.10 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఎక్కువగా 5జీ స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. కాగా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 5జీ

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 04:00 PM IST

ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఎక్కువగా 5జీ స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. కాగా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 5జీ స్మార్ట్ ఫోన్ లపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అందుకు అనుగుణంగానే 5జీ స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్ లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ13సీ పేరుతో మార్కెట్లోకి బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ 13సీ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు మూడు వేరియంట్ లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరింట్ ధర రూ. 9,999 కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 11,499కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది. రెడ్‌మీ 13సీ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,600 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ట్రిపుల్ స్లాట్ సిమ్‌ ట్రేని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు.

అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ విషయానికొస్తే 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని కూడా అందించారు. ఇక రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిసెంబర్‌ 12వ తేదీ నుంచి అమెజాన్‌తో పాటు రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది.