Redmi A3: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రెడ్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్ప

  • Written By:
  • Updated On - February 15, 2024 / 06:07 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త ఫోన్లు విడుదల అవుతాయా అని వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు క్రేజ్ డిమాండ్ ఉంది. కాగా రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి తీసుకు వచ్చింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తాజాగా ఫిబ్రవరి 14వ తేదీన రెడ్‌మీ ఏ3 ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ తొలి సేల్‌ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే.. బేస్‌ వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,299గా ఉండ నుంది. అలాగే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ. 8,299 కాగా 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9.299గా ఉండనుంది. ఈ ఫోన్‌ మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్స్‌లలో లభిస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. 1,600×700 పిక్సెల్‌లు రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో డిస్‌ప్లే చుట్టూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ36 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. కాగా కెమెరా విషయానికి వస్తే రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ రెయిర్ కెమెరాను అందించారు.అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 10 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.