Site icon HashtagU Telugu

Redmi A3x: రెడ్ మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధర కి ఎక్కువ ఫీచర్స్!

Redmi A3x

Redmi A3x

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫోన్ల లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే రెడ్‌మీ భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్ తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయడం విశేషం.

ఇకపోతే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6999 కాగా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999గా ఉంది. షావోమీ ఇండియా వెబ్‌సైట్‌ తో పాటు, అమెజాన్‌ లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ గ్రీన్, అలీవ్ గ్రీన్, స్టారీ వైట్ వంటి కలర్ లభించనుంది. ఇందులో 6.71 ఇంచెస్‌ తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డాట్ డ్రాప్‌ స్క్రీన్‌ ను కూడా అందించారు. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌, 720×1650 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం అని చెప్పవచ్చు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ర్యామ్‌ ను వర్చువల్‌ గా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. కాగా ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. అలాగే రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తోంది.
ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 8 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను అదించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 10వాట్ల వైర్డ్ చార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.