ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోని తాజాగా రెడ్‌మీ కంపెనీ తన రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. రూ.25,999 ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 7 వేల డిస్కౌంట్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాగా ఈ Redmi K50i 5G ధర విషయానికి వస్తే.. రెండు వేరియంట్లుగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్‌లో 6జీబీ ర్యామ్,128జీబీ రోమ్, 8జీబీ ర్యామ్ 25జీబీ రోమ్ ఉన్నాయి. మొదటి వేరియంట్ ధర ధర రూ.25,999 కాగా, దీన్ని రూ.18,999కే అందించనున్నట్లు రెడ్‌మీ సంస్థ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే రెండో వేరియంట్ ఆఫర్ గురించి ప్రస్తావించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు క్విక్ సిల్వర్, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ వంటి కలర్స్ లో లభించనుంది. ఇకపోతే Redmi K50i 5G స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే..
ఈ రెడ్‌మీ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే, డాల్బీ విజన్ సర్టిఫికేషన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు సెటప్ ఉంది. 63 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో షూటర్‌తో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే 5080 mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ చార్జింగ్ సప్పోర్ట్ ఉన్నాయి.