ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్ మీ గురించి మనందరికీ తెలిసిందే. రెడ్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల సూపర్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తూనే ఉంది.. అందులో భాగంగానే ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. భారతదేశంలో చౌకైన రెడ్‌మీ ఏ5 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తుంది. ఇది 6.88 అంగుళాల హెచ్డీ + LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ లో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
దీనితో పాటు, రెడ్‌మీ ఈ బడ్జెట్ ఫోన్ లో ఆక్టాకోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4జీబీ RAM, 4జీబీ వర్చువల్ RAMకి మద్దతు ఇస్తుంది. కాగా రెడ్‌మీ ఏ5 4జీ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ చేసింది. దీని మొదటి వేరియంట్ 3జీబీ రామ్ + 64జీబీ స్టోరేజ్ తో రూ.8999 ధరగా ఉంది. ఈ ఫోన్ ను మొదటి సేల్ లో రూ. 6499 కు కొనుగోలు చేయవచ్చట. ఇక రెండవ వేరియంట్ 4జీబీ రామ్ + 128జీబీ స్టోరేజ్ తో రూ.9999 కు వస్తుంది. దీనిని మొదటి సేల్ లో రూ. 7499 కు కొనుగోలు చేయవచ్చట. అలాగే ఈ ఫోన్ ను మూడు కలర్స్‌లో విడుదల చేసింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ వంటీ కలర్స్లో లభించనుంది.
ఈ ఫోన్ మొదటి అమ్మకం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభమైంది. డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.88 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్. ఈ ఫోన్ లో 1.8 GHz ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్ ఉంది. దీనిలో గ్రాఫిక్స్ సపోర్ట్ కోసం Mali-G57 MP1 GPU ఉంది. అలాగే ఈ ఫోన్ 3జీబీ, 4రామ్ తో 64జీబీ, 128జీబీ స్టోరేజ్ తో లాంచ్ చేసింది కంపెనీ. దీనితో పాటు, స్టోరేజ్ కోసం ఫోన్‌లో మైక్రో SD కార్డ్ కూడా అందించింది. అలాగే ఈ ఫోన్‌లో 32ఎంపీ వెనుక కెమెరా ఉంది, దీనికి f/2.0 ఎపర్చరు ఉంది. దీనితో పాటు, సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రెడ్‌మీ ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, ఫోన్‌లో USB టైప్ సీ పోర్ట్ అందించబడింది.