Site icon HashtagU Telugu

Redmi 13C Offer: రెడ్ మీ ఫోన్ పై బంపర్ ఆఫర్.. కేవలం రూ.9వేలకే సొంతం చేసుకోండిలా?

Mixcollage 24 Jan 2024 02 27 Pm 6037

Mixcollage 24 Jan 2024 02 27 Pm 6037

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫోన్ల లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రెడ్ మీ ఫోన్ పై భారీగా తగ్గింపు ధరను ప్రకటించింది. రెడ్ మీ 13సీ 6జీబీ ర్యామ్ ,128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై అమెజాన్‌లో మంచి డీల్ అందించబడుతోంది.

ఈ వేరియంట్ MRP ధర రూ.13,999 ఉండగా అమెజాన్ లో దీనిని రూ.9,999కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ కస్టమర్లకు 29 శాతం తగ్గింపు ఇస్తున్నారు. ఈ తగ్గింపుతో పాటు, అన్ని బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,000 ఫ్లాట్ తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది. దీంతో వినియోగదారులు రూ. 8,999 ప్రభావవంతమైన ధరతో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, ఇక్కడ కస్టమర్లకు EMI ఆప్షన్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. కస్టమర్లు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.9,499 తగ్గింపును కూడా పొందవచ్చు.

అయితే, గరిష్ట తగ్గింపు కోసం, ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. ఇకపోతే రెడ్ మీ 13సీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 600nits బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అందించబడింది. ఈ ఫోన్‌లో 6జీబీ వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మొత్తం 12జీబీ వరకు ర్యామ్ పొందుతారు. ఇందులో MediaTek G85 ప్రాసెసర్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫోటోగ్రఫీ కోస ఫోన్ వెనుక భాగంలో 50ఎంపీ AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని బ్యాటరీ 5000mAh. అంతేకాకుండా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించబడింది.