Site icon HashtagU Telugu

Redmi 13 Note Pro Price: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రెడ్ మీ సరికొత్త స్మార్ట్ ఫోన్?

Mixcollage 04 Jan 2024 03 01 Pm 1156

Mixcollage 04 Jan 2024 03 01 Pm 1156

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే రెడ్ మీ నోట్ 13 సిరీస్‌లు చైనాలో విడుదలయ్యాయి. షావోమీ కంపెనీ జనవరి 4న భారత్‌లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌ మీ మొత్తం మూడు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ రెడ్ మీ నోట్ 13 5జీ, రెడ్ మీ నోట్ 13 ప్రో 5Gతో పాటు రెడ్ మీ నోట్ 13 ప్రో + 5జీ ను కూడా లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ మూడు మొబైల్స్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ రెడ్‌మి నోట్ 13 ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌ విడుదల కంటే ముందే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారతదేశంలో విడుదల కాబోయే రెడ్ మీ నోట్ 13 Pro+ రిటైల్ బాక్స్‌ ఫోటోలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్‌ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ మొబైల్‌ 12జీబీ ర్యామ్ , 512జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రాబోతోందని తెలుస్తోంది. ఈ వేరియంట్‌ గరిష్ట రిటైల్ ధర రూ. 37,999 ఉండబోతున్నట్లు ఫోస్ట్‌ ద్వారా తెలుస్తోంది. మార్కెట్‌లోకి విడుదలైతే బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా రూ.2000 వరకు తగ్గే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. మొదట ఈ మొబైల్‌ను రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఈ స్మార్ట్ ఫోన్‌ ఫ్యూజన్ వైట్, ఫ్యూజన్ పర్పుల్ , ఫ్యూజన్ బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతోంది. ఈ రెడ్ మీ నోట్ 13 ప్రో + మొబైల్‌ 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 7200 SoC, 200ఎంపీ అల్ట్రా హై రెస్ కెమెరా సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే 5000mAh బ్యాటరీ, 120W హైపర్‌ఛార్జ్, IP68 రేటింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. డిస్‌ప్లే ప్రోటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కూడా అందిస్తోంది.బాక్స్ లోపల 120W అడాప్టర్‌తో పాటు కెబుల్‌ ఉంటుందని సమాచారం. అలాగే ఈ Redmi Note 13 Pro+ మొబైల్‌ 19 నిమిషాల్లో 0-100 శాతం నుంచి ఛార్జ్ చేయగలదని కూడా కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు Dolby Vision Atmos సపోర్ట్‌తో కూడిన అతి శక్తివంతమైన 1.5K 10+2 బిట్ ప్యానెల్‌తో డిస్‌ప్లేతో రాబోతున్నట్లు తెలస్తోంది. ఈ మొబైల్‌ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.