Site icon HashtagU Telugu

Realme 10: మార్కెట్ లోకి రియల్ మీ10.. ధర, ఫీచర్స్ ఇవే?

Realme 10

Realme 10

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది రియల్‌మీ సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ 10 పేరుతో తన ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను భారత్ మార్కెట్ లోకి లాంచ్‌ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీకి సపోర్ట్ ఇవ్వకపోవడం రియల్‌మీ వినియోగదారులను నిరాశ పరిచింది.

ఇకపోతే ఈ రియల్‌మీ 10 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే..6.5అంగుళాల ఫుల్ హెచ్డి AMOLED డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 OS, MediaTek Helio G99 SoC, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 50 ఎంపీ ఏఐ, 2 ఎంపీ బ్లాక్ అండ్ వైట్ పొట్రయిట్ రియర్‌ డ్యుయల్‌ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభించునుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. కాగా ఈ ఫోన్ మనకు క్లాస్ వైట్,రష్ బ్లాక్ అనే రెండు కలర్లలో లభించునుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే..

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 13,999 గా ఉంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,999గా ఉంది. అయితే స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన తొలి సేల్ జనవరి 15నుంచి రియల్‌ మీ, ఫ్లిప్‌కార్ట్‌ ఇతర ఆన్‌లైన్‌ స్టోర్లలో లభ్యం కానుంది.

Exit mobile version