ఏదైనా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా. అయితే రియల్ మీ వి సిరీస్ లో భాగంగా తాజాగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ పై ఒక లుక్కెయ్యండి. తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ అత్యధిక ఫీచర్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. బ్యాటరీ విషయంలో కూడా తగ్గేదేలే అంటోంది ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది. రియల్‌మి వి60 ప్రో మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధక కు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది.
45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. రియల్‌మీ వి60 ప్రో, 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీతో సీఎన్‌వై 1,599 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 18,600గా ఉంది. 12జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 1,799 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 21వేలు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో లక్కీ రెడ్, రాక్ బ్లాక్, అబ్సిడియన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇకపోతే రియల్ మీ వి60 ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
రియల్ మీ వి60ప్రో ఆండ్రాయిడ్ 14లో రియల్ మీ యూఐ 5తో రన్ అవుతుంది.
625నిట్స్ గరిష్ట ప్రకాశం, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ ను కలిగి ఉంది. 12జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో మెమరీని 2టీబీ వరకు విస్తరించవచ్చు. అయితే, డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ (DRE) ఫీచర్‌ని ఉపయోగించి ర్యామ్ వర్చువల్‌గా 24జీబీ వరకు విస్తరించవచ్చు.