చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ రియల్ మీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది రియల్ మీ సంస్థ. ముఖ్యంగా రియల్ మీ ఎక్కువ శాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లనే మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ శాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది రియల్ మీ. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
తన పి సిరీస్ నుంచి కొత్త రియల్ మీ పీ2 ప్రో 5జీ ఫోన్ ను సెప్టెంబర్ 13న ఆవిష్కరించింది. దీనిలో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ విక్రయాలు ఆన్ లైన్ లో ప్రారంభం అయ్యాయి. రియల్ మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ప్యారట్ గ్రీన్, ఈగిల్ గ్రే వంటి రెండు రకాల కలర్ ఆప్షన్ లలో అందుబాటులోకి వచ్చింది. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్, 4 ఎన్ఎం ప్రాసెస్, 2.4 జీహెచ్ జెడ్ సీపీయూ, ఆండ్రెనో 710 జీపీయూ తదితర వాటిని ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫోన్ 8 జీబీ 12 జీబీ ర్యామ్ 128 జీబీ 256 జీబీ, 512 జీబీ లాంటి స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కొత్త కొత్త రియల్ మీ ఫోన్ లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు.
మంచి పిక్సెల్, ఎఫ్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ వరకూ రిఫ్రెష్ రేటు కారణంగా విలువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 80 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జర్ కు మద్దతు ఇస్తుంది. రోజంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 ఓఐఎస్, 8 ఎంపీ అల్ట్రావైడ్, 32 ఎంపీ సోనీ సెల్పీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా రియల్ మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మూడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ రూ.21,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ.27,999 గా ఉంది. అయితే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లపై తగ్గింపు ధరలను కూడా ప్రకటిస్తున్నారు అన్ని రకాల వేరియంట్లపై రూ.2 వేలు ప్రారంభ తగ్గింపు ఉంటుంది. వీటితో పాటు వెయ్యి రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను అమలవుతోంది. అంటే మిడ్ వేరియంట్ ను రూ.21,999కు, టాప్ వేరియంట్ ను రూ.24,999కు కొనుగోలు చేసుకునే వీలు ఉంటుంది.