Site icon HashtagU Telugu

Realme: రియల్‌మీ స్మార్ట్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?

Mixcollage 19 Jan 2024 04 49 Pm 845

Mixcollage 19 Jan 2024 04 49 Pm 845

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ ప్రముఖ దిగ్గజ సంస్థ రియల్‌మీ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అంటే జనవరి 19 అమ్మకాలకు చివరి రోజు. ఈ సేల్‌లో రియల్‌మీ నార్జో 60ఎక్స్ భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.

రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రియల్‌మీ నార్జో 60ఎక్స్ ఫోన్ 4 జీబీ + 128 జీబీ, 6 జీబీ + 128 జీబీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్లను రూ.11,499, రూ.12,499 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. బ్యాంక్ ఆఫర్లనూ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇకపోతే ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను పొందుపరిచారు.

బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్ మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ నార్జో 60ఎక్స్ పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.2, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ మనకు పర్పుల్, గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.