Realme 12 Pro: త్వరలో మార్కెట్ లోకి విడుదల కాబోతున్న రియల్‌మీ స్మార్ట్ ఫోన్స్.. ధర, ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ ప్రముఖ దిగ్గజ సంస్థ రియల్‌మీ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 09:10 PM IST

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ ప్రముఖ దిగ్గజ సంస్థ రియల్‌మీ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే త్వరలోనే మార్కెట్లోకి రియల్ మీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల కాబోతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. రియల్‌మీ కూడా రూ.25వేల నుంచి రూ.30వేల రేంజ్‌లో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తోంది. కంపెనీ త్వరలో రియల్‌మీ 12 సిరీస్ మోడళ్లను భారత్‌లో లాంచ్ చేయనుంది. రియల్‌మీ 12 ప్రో, 12 ప్రో ప్లస్ ఫోన్లు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నాయి.

కాగా ఈ రియల్‌మీ 12 ప్రో ఫోన్ RMX3842, రియల్‌మీ 12 ప్రో ప్లస్ ఫోన్ RMX3840 మోడల్ నంబర్లతో డిసెంబర్ 8న BIS సర్టిఫికేషన్ పొందాయి. ఇదే మోడల్ నంబర్‌తో రియల్‌మీ 12 ప్రో ప్లస్ ఎడిషన్ ఇండోనేషియాలో SDPPI సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కూడా కనిపించింది. దీంతో త్వరలో ఇవి గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీఐఎస్ సర్టిఫికేషన్ తప్ప, కొత్త స్మార్ట్‌ఫోన్ల ధర, ఫీచర్ల గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.కాగా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో చైనాలో లాంచ్ అవుతాయని కొన్ని సోర్సుల ద్వారా తెలుస్తోంది. రియల్‌మీ 12 ప్రో 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్‌ మోడల్ ధర RMB 2,099 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.25,000 ఉంటుందని అంచనా. ప్లస్ ఎడిషన్ ధర మరింత ఎక్కువగా ఉండవచ్చు.

చైనాలో లాంచ్ అయిన తర్వాత, ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు భారతదేశంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే రియల్‌మీ 12 ప్రో ఫోన్‌, 2x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ ఉన్న 32ఎంపీ IMX709 టెలిఫోటో లెన్స్‌తో రావచ్చు. అయితే ప్రీమియం రియల్‌మీ 12 ప్రో ప్లస్ మాత్రం, 3x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ ఉన్న 64 ఎంపీ ఓమ్నివిజన్ OV64B లెన్స్‌తో రావచ్చు. ఈ సిరీస్ ఫోన్లు రెండూ డ్యుయల్ కెమెరా సెటప్‌తో, వెనుక వైపు సర్క్యులర్ కెమెరా లేఅవుట్‌ను కలిగి ఉంటాయని 91మొబైల్స్ సైట్ పేర్కొంది. నివేదికల ప్రకారం.. రియల్‌మీ 12 ప్రో ఫోన్ 4nm ప్రాసెస్ ఉన్న క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది.