Site icon HashtagU Telugu

Realme 12 Pro: రియల్‌మీ నుంచి రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్స్.. స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఫీచర్స్?

Mixcollage 15 Jan 2024 02 22 Pm 9427

Mixcollage 15 Jan 2024 02 22 Pm 9427

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా కూడా రియల్‌మీ మార్కెట్ లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేయబోతోంది. రియల్‌మీ 12 ప్రో సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్‌ చేయనుంది.ఇందులో భాగంగా రియల్‌మీ 12 ప్రో తో పాటు, రియల్‌మీ 12 ప్రో+ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

ఈ రెండు ఫోన్‌లను రియల్‌మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ రెండు ఫోన్స్‌లో కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో యూఐ5 వర్షన్‌‌పై ఔటాఫ్ బాక్స్‌ను అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. రియల్‌ మీ 12 ప్రో+లో 64 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

అలాగే ఈ ఈ స్మార్ట్‌ ఫోన్స్ మనకు బ్లాక్, ఆరెంజ్, క్రీమ్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్ సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీని అందించనున్నారు.

Exit mobile version