Narzo n55: మార్కెట్లోకి మరో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 06:10 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది రియల్‌మీ సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్ మీ నార్జో ఎన్‌55 పేరుతో విడుదల చేయబోతోంది.

ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ 12న లాంచ్‌ చేయనుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో డ్యూయల్ టోన్ డిజైన్, వెనుక రెండు కెమెరాలతో లభించనుంది. అలాగే పవర్ బటన్‌ను ఫింగర్‌ప్రింట్ స్కానర్‌గా కూడా వినియోగించవచ్చు. మీడియాటెక్‌ జీ88 చిప్‌సెట్‌తో రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ టెక్నిక్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ కేవలం 29 నిమిసాల వ్యవధిలోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది. ఏఐ ఫేస్‌ అన్‌లాక్‌ వంటి అధునాతన ఫీచర్స్‌ను అందిస్తున్నట్లు సమాచారం.

3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌సీ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 12 నుంచి రూ. 15 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఖచ్చితమైన ఫీచర్స్ నీ విడుదల చేయకపోయినప్పటికీ మార్కెట్లో లీకైన వివరాల ఆధారంగా ఇవే అని తెలుస్తోంది.