Site icon HashtagU Telugu

Realme P2 Pro: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్!

Realme P2 Pro

Realme P2 Pro

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ రియల్ మీ గురించి మనందరికీ తెలిసిందే. రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకదానిని మించి ఒకటి అద్భుతమైన పిచ్చర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే రియల్ మీ సంస్థ ఇప్పుడు భారత మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. రియల్‌మీ పీ2 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. మరి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఈ రియల్ మీ పి2 ప్రో స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే..

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999 గా నిర్ణయించారు ఇందులో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ ను అందించనున్నారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్‌ లో 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని కూడా అందిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై డిస్కౌంట్స్‌ కూడా లభించనున్నాయి. ఇక బిగ్ బిలియన్‌ డేస్‌ లో భాగంగా ఈ ఫోన్‌ పై మరిన్ని ఆఫర్స్‌ లభించనున్నాయి.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ ను అందిస్తున్నారు. ఇక 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ తో కూడిన స్క్రీన్‌ ను ఇందులో అందించనున్నారు. అలాగే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ వంటి ఫీచర్లను కూడా ఇందులో ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌ను ప్యారట్ గ్రీన్, ఈగల్ గ్రే వంటి కలర్స్ లలో లభించనుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఏఐ గేమింగ్ ఐ ప్రొటెక్షన్‌ ను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందిచనున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అలాంటి విషయాలు ఇంకా వెల్లడించలేదు.