Site icon HashtagU Telugu

Realme Note 50 4G: అతి తక్కువ అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న రియల్‌మీ ఫోన్?

Mixcollage 03 Jan 2024 07 15 Pm 1348

Mixcollage 03 Jan 2024 07 15 Pm 1348

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే కూడా రియల్‌మీ మార్కెట్ లోకి మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. రియల్‌ నోట్‌ 50 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. అయితే త్వరలో విడుదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో వినియోగదాలను విపరీతంగా ఆకర్షించనుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

కాగా ఈ 4జీ స్మార్ట్‌ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆన్‌లైన్‌ వేదికగా కొన్ని ఫీచర్లు, ధర వివరాలు లీక్‌ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను చాలా తక్కువ బడ్జెట్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ నోట్‌ 50 స్మార్ట్‌ ఫోన్‌ యూనిఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నట్లు సమాచారం. అలాగే 4జీ వరకు అదనంగా ర్యామ్‌ను ఎక్స్‌టెండ్‌ చేసుకోవచ్చు. ఇక రియల్‌మీ నోట్‌ 50 స్మార్ట్ ఫోన్‌ స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 66.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ ప్యానెల్‌ను అందించనున్నట్లు సమాచారం.

ఇక కెమెరా విషయానికొస్తే రియల్‌మీ నోట్‌ 50 స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఫ్రంట్‌ కెమెరా స్లాట్‌ కోసం వాటర్‌ డ్రాప్‌ నాట్చ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ రూ. 7 వేల నంచి రూ. 8 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లను త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే రియల్ మీ నుంచి ఇటీవలే రియల్‌మీ సీ67 స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్ ధర రూ. 13,999గా ఉంది.