Realme Narzo 70 Pro 5G: మార్కెట్లోకి విడుదల కాబోతున్న రియల్ మీ సరికొత్త స్మార్ట్ ఫోన్ .. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు

  • Written By:
  • Updated On - February 25, 2024 / 06:51 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది రియల్ మీ సంస్థ. మరి అసలు కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. రియల్‌ మీ తాజాగా మిడ్ రేంజ్‌ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ నార్జో 70 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వచ్చే నెలలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. అయితే మార్చినెలలో ఏ తేదీన ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారన్నదానిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రియల్‌ మీ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో సెంట్రల్లీ కెమెరా మాడ్యూల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీని అందించనున్నారు. ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. 64 మెగాపిక్సెల్స్‌తో ఓమ్నీ విజన్ ఓవీ64బీ టెలిఫోటో కెమెరాను అందించారు. 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన 8 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించనున్నారు.

ఇక సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.