Site icon HashtagU Telugu

Realme C53: మార్కెట్ లోకి కొత్త రియల్ మీస్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Realme 12 Pro

Realme 12 Pro

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది రియల్ మీ సంస్థ. రియల్‌మీ సీ53 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్ కీ సంబంధించిన వివరాల్లోకి వెళితే..

We’re now on WhatsApp. Click to Join

ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. గేమ్స్‌ ఆడుకోవడానికి, వీడియోలు చూడడానికి ఈ స్క్రీన్‌ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఈ స్క్రీన్‌ 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో తీసుకొచ్చారు. ఇక రియల్‌మీ సీ53 స్మార్ట్ ఫోన్‌ యూనిసోక్‌ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ సులభంగా ఉంటుంది. గేమ్స్‌ ఆడుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Also Read: Vastu Tips: మీ ఇంట్లో రావి చెట్టు పెరిగిందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఫ్రంట్ కెమెరాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 8,999కాగా, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7499కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 9,199గా ఉండనుందని తెలుస్తోంది.

Also Read: Eye Care: సమ్మర్ లో కళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

Exit mobile version