Site icon HashtagU Telugu

Realme C75: బడ్జెట్ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్?

Realme C75

Realme C75

ఇటీవల కాలంలో మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికీ వినియోగదారుల కోసం ఎన్నో రకాల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌ మీ సీ75 పేరుతో ఈ ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వియత్నం మార్కెట్‌లో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఈ కొత్త ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రియల్‌మీ సీ75 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.72 ఇంచెస్‌ తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌కు ఈ స్క్రీన్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలోయి జీ92 మ్యాక్స్‌ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ లో నీరు, దుమ్మును తట్టుకునే విధంగా ఐపీ69 రెసిస్టెంట్‌ రేటింగ్‌ ను కూడా అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా.పిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. రియల్‌మీ సీ75 స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ కెసాపిసిటీ బ్యాటరీని అందించారు. రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేయడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 18,900 కాగా 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,600 గా ఉంది. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,900గా ఉండనుంది. భారత కరెన్సీలో ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ధర ఎంత అన్న క్లారిటీ ఇవ్వలేదు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 4జీ, వైఫై 5, బ్లూటూత్‌ 5.0 వంటి ఫీచర్లను అందించారు.